
కాగజ్ నగర్, వెలుగు : కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో సిబ్బంది చెత్త ఏరుతూ దొరికిన ఖాళీ లిక్కర్ సీసాలు అమ్మి రూ. రూ.5 వేలు ఆదాయం సంపాదించి పెట్టారు. గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో బీరు సీసాలు, వైన్ బాటిల్స్, ఇతర మద్యం సీసాలు సేకరించి డంప్ యార్డులో పెట్టారు. బీరు బాటిల్స్, విస్కీ, బ్రాందీ సీసాలను వేరు చేసి స్క్రాప్ లో అమ్మగా రూ.5 వేలు వచ్చాయని సర్పంచ్ వొజ్జెల మౌనీశ్, ఉప సర్పంచ్ తిరుపతి, సెక్రటరీ సాయి కృష్ణ తెలిపారు.