పాడుబడ్డ భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ బిల్డింగ్

పాడుబడ్డ భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ బిల్డింగ్

భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ బిల్డింగ్​కు ప్రపోజల్స్ ​పంపండి. రూ.10 కోట్లతో ఎస్టిమేషన్ రెడీ చేయండి. ఫండ్స్​ ఇస్తా’’నని అప్పటి సీఎం కేసీఆర్ గొప్పగా ప్రకటించారు.​ రెండేండ్లు గడిచినా ఈ హామీకి అతీగతీ లేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో కొత్త బిల్డింగ్​ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ బిల్డింగ్, ​మీటింగ్​ హాల్​ను చాలీచాలని గదుల్లో ఆఫీసర్లు నడిపిస్తున్నారు. అవసరమైన ల్యాండ్​ ఉందని, బిల్డింగ్​ నిర్మాణాలకు ఫండ్స్ కావాలని అప్పటి సీఎం కేసీఆర్​ను జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య కోరారు. స్పందించిన గులాబీ అధినేత ప్రపోజల్స్ పంపించండి.. ఫండ్స్​ ఇస్తానని చెప్పడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు సంబురపడ్డారు. ఆ తర్వాత ఏండ్లు గడిచినా నిధులు జాడ లేకపోవడంతో ఉసూరుమన్నారు. 

టెంట్ల కింద కూర్చునే దుస్థితి..

ప్రస్తుతం జడ్పీ​జనరల్​బాడీ మీటింగ్ పెడితే సగం మంది ఆఫీసర్లు ఆఫీస్​ఆవరణలో టెంట్ల కింద కూర్చునే దుస్థితి. ఏడు స్టాండింగ్​కమిటీల మీటింగ్​లు ఇరుకు గదుల్లోనే. పైగా ఇప్పుడున్న బిల్డింగ్​శిథిలావస్థకు చేరింది.  

జడ్పీటీసీలకు స్పెషల్​రూం​ ఇవ్వలె

తమకు ప్రత్యేక గది ఇవ్వాలని లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాల జడ్పీటీసీలు పలుమార్లు కోరినప్పటికీ రేపు మాపంటూ కాలం వెళ్లదీశారు. లక్ష్మీదేవిపల్లి జడ్పీటీసీ మేరెడ్డి వసంత ప్రతీ జనరల్​ బాడీ సమావేశంలో తనకు రూమ్​ఇవ్వనందుకు మీటింగ్​అయ్యేంత వరకు నిలబడే ఉంటూ నిరసన తెలిపారు. ‘‘ఇండిపెండెంట్​గా గెలిచావు.. మా పార్టీలో చేరమంటే చేరడం లేదు”అంటూ అప్పటి బీఆర్ఎస్​ పాలకులు వసంతను పలు విధాలుగా ఇబ్బందులు పెట్టిన దాఖలాలూ ఉన్నాయి. ఆగస్టు 7తో తమ పాలక వర్గం ముగియనున్న నేపథ్యంలో ఆలోపే కొత్త బిల్డింగ్​కు ఫండ్స్​ మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జడ్పీ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్​, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.