Jamuna : ముగిసిన జమున అంత్యక్రియలు

Jamuna : ముగిసిన జమున అంత్యక్రియలు

సీని నటి జమున అంత్యక్రియలు అభిమానుల అశ్రునయనాల మధ్య  ముగిశాయి. ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. జమున కుమార్తె స్రవంతి ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు. హిందూ సంప్రదాయాలను అనుకరిస్తూ ఆమె తల్లి చితికి నిప్పు అంటించారు. జమునకు కుమారుడు కూడా ఉన్నాడు. కానీ ఆయన విదేశాల్లో ఉండటంతో రావాడానికి ఆలస్యం అవుతుందని తెలియడంతో కుమార్తె స్రవంతి దహన సంస్కారాలు నిర్వహించారు.  గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జమున  శుక్రవారం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1936 లో జన్మించిన జమున అంచలంచెలుగా ఎదిగి తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు198 సినిమాల్లో నటించారు.