సీనియర్ పాత్రికేయులు గుడిపూడి శ్రీహరి ఇకలేరు

సీనియర్ పాత్రికేయులు  గుడిపూడి శ్రీహరి ఇకలేరు

సీనియర్ పాత్రికేయులు గుడిపూడి శ్రీహరి ఇకలేరు. సోమవారం రాత్రి రెండు గంటలకు ఆయన కన్నుమూశారు. గత నవంబర్ లో ఆయన సతీమణి లక్ష్మి మరణించింది. అప్పటినుండి ఆయన ఇంటికే పరిమితమయ్యారు. వారం రోజుల క్రితం ఇంట్లో పడిపోవడంతో కుటుంబసభ్యులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. సుమారు 55 ఏళ్ల పాటు ఆయన పాత్రకేయుడిగా, సినీ విశ్లేషకుడిగా సేవలందించారు.అంతేకాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనే పుస్తకాన్ని కూడా ఆయన రచించారు. శ్రీహరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.