కరీంనగర్, వెలుగు: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదైంది. గురువారం ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ రోడ్డుపై కూర్చోవడం, పోలీసుల విధులను అడ్డుకోవడంతో హుజురాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ పేరుతో పిలుస్తూ మతపరమైన భావాలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. వీణవంక గ్రామాన్ని తగలబెడతామని హెచ్చరించారు. దీంతో బీఎన్ఎస్ సెక్షన్ 189(3), 132, 221, 296 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
సీఐ కరుణాకర్ ఫిర్యాదు మేరకు.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు తక్కళ్లపల్లి సత్యనారాయణ(కన్నూరు), ఆడవెల్లి కొండల్ రెడ్డి(సిర్సపల్లి), బండ శ్రీనివాస్, ఎండీ గఫార్, ఎస్ కే అర్షద్, అంజదుల్లా ఖాన్, చింతా శ్రీనివాస్, విడపు అరుణ్ రాగ్(హుజురాబాద్), ఇల్లందుల రాకేశ్(దమక్కపేట), కట్కూరి మల్లారెడ్డి(రాజపల్లి), వర్ధమనేని రవీందర్ రావు, కల్లెపు రోశేందర్(రాజేందర్), కొలిపాక అజయ్, కొలిపాక నవీన్(హుజూరాబాద్)ను నిందితులుగా చేర్చారు.
