ఒమిక్రాన్ భయం.. కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు

ఒమిక్రాన్ భయం.. కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు


స్టాక్ మార్కెట్లు బేర్ మంటున్నాయి. ఒమిక్రాన్ భయాలు దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతుండటంతో భారీగా నష్టపోతున్నాయి. మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా నష్టపోయింది. ప్రస్తుతం 55,750 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే ఇన్వెస్టర్లు 5.2లక్షల కోట్లు నష్టపోయారు. అటు నిఫ్టీ సైతం నష్టాల్లోనే ట్రేడ్ అవుతోంది. 320 పాయింట్ల లాస్ తో 16,650 పాయింట్ల వద్ద కంటిన్యూ అవుతోంది. బ్యాంకింగ్, ఆటో మొబైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, రియల్టీ ఇండెక్స్ లు భారీగా నష్టపోతున్నాయి.

For more news

ఒమిక్రాన్ పేషంట్ కు సీరియస్

వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి.. బూస్టర్ డోసు తప్పనిసరి