
కేంద్ర బడ్జెట్ వెలువడిన వేళ స్టాక్ మార్కెట్ లు భారీ పతనాన్ని నమోదుచేశాయి. మధ్యాహ్నం వరకు ఉన్న నివేధిక ప్రకారం BSE 448 పాయింట్లు నష్టపోయి 39,459 వద్ద కొనసాగుతుంది. NSE 141పాయింట్ల నష్టంతో 11,802 దగ్గర ఉంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటీ, మెటల్, ఆటో రంగాలు నష్టపోతున్నాయి.
లాభాల్లో కొనసాగుతున్న కంపెనీలు: ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఇండియా బుల్స్ హౌసింగ్ లిమిటెడ్
నష్టాలను చవిచూస్తున్న కంపెనీలు: యస్ బ్యాంకు, ఓఎన్జీసీ, ఎన్‌టీపీసీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.