నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు మళ్లీ  బేర్మన్నాయి. గత ట్రేడింగ్ సెషన్లో భారీగా లాభపడ్డ దేశీయ మార్కెట్లు ఇవాళ నష్టాలు మూటగట్టుకున్నాయి. అన్నీ సానుకూల సంకేతాలే ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గుచూపడం మార్కెట్కు ప్రతికూలంగా మారింది. అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడం, ఆసియా మార్కెట్లు సైతం సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ ఇన్వెస్టర్లు గరిష్ఠస్థాయిల వద్ద లాభాల స్వీకరించారు. ఫలితంగా ట్రేడింగ్ ఆద్యంతం ఒడిదొడుకుల మధ్య సాగింది. 

ఉదయం 58,310.68 పాయింట్ల వద్ద ప్రారంభమైన మార్కెట్లో ట్రేడింగ్  57,780.28పాయింట్లు ఇవాళ్టి కనిష్ఠ స్థాయి. మిడ్ సెషన్లో 58,569.22పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సెన్సెక్స్.. మార్కెట్ ముగిసే సమయానికి 145.37పాయింట్ల లాస్ తో 57,996.68 -వద్ద క్లోజయింది. భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్,  కొటక్ మహీంద్రా షేర్లు లాభాలు ఆర్జించగా.. హిందుస్తాన్ యూనిలీవర్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, ఐటీసీ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. 

నేషనల్ స్టాక్  ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ కూడా ఒడిదొడుకుల మధ్య నష్టాల్లోనే ముగిసింది. 30.25పాయింట్ల లాస్ తో 17,322.20 వద్ద క్లోజయింది.

For more news..

చైనా కంపెనీకి ఐటీ శాఖ షాక్

టీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీతోనే రాష్ట్రం అప్పులపాలు