ఫ్లాట్‌‌‌‌గా సెన్సెక్స్‌‌

ఫ్లాట్‌‌‌‌గా సెన్సెక్స్‌‌

ముంబై: బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు సోమవారం సెషన్‌‌ను ఫ్లాట్‌‌గా ముగించాయి.  త్వరలో కంపెనీల క్వార్టర్లీ రిజల్ట్స్ వెలువడనుండడంతో ఇన్వెస్టర్లు వేచి చూడాలనే ఆలోచనలో ఉన్నారు. 30 షేర్లున్న సెన్సెక్స్ సోమవారం 14 పాయింట్లు పెరిగి 59,847 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్‌‌ 276 పాయింట్లు లాభపడింది. ఎన్‌‌ఎస్ఈ నిఫ్టీ  25 పాయింట్లు పెరిగి 17,624 వద్ద ముగిసింది. సియోల్‌‌, జపాన్ మార్కెట్‌‌లు సోమవారం సెషన్‌‌లో లాభాల్లో కదలగా, షాంఘై మార్కెట్ లాస్‌‌లో క్లోజయ్యింది. ‘ఆటో,  రియల్ ఎస్టేట్‌‌ కంపెనీల  క్వార్టర్లీ బిజినెస్ అప్‌‌డేట్స్ పాజిటివ్‌‌గా ఉన్నాయి.

ఫలితంగా ఈ సెక్టార్ల షేర్లు ఎక్కువగా కదిలాయి. కానీ, యూఎస్ జాబ్ డేటా స్ట్రాంగ్‌‌గా ఉండడంతో  ఓవరాల్ మార్కెట్ మూడ్‌‌ మాత్రం కొద్దిగా తగ్గింది. ఫెడ్ మళ్లీ వడ్డీ రేట్లు పెంచొచ్చనే భయాలు ఎక్కువయ్యాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ఇండియా, యూఎస్ ఇన్‌‌ఫ్లేషన్ డేటాతో పాటు ఫెడ్ మినిట్స్ కూడా వెలువడనున్నాయి. మార్కెట్ ట్రెండ్‌‌ను ఇవి నిర్ణయిస్తాయి’ అని అన్నారు. బ్రెంట్ క్రూడాయిల్ సోమవారం సెషన్‌‌లో బ్యారెల్‌‌కు 85.19 వద్ద ట్రేడవుతోంది. యూఎస్ డాలర్ వీక్‌‌గా ఉండడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం 5 పైసలు బలపడి 81.97 వద్ద సెటిలయ్యింది. ఆరు మేజర్ కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్‌‌‌‌ సామర్ధ్యాన్ని కొలిచే డాలర్ ఇండెక్స్ 102.06 వద్ద కదులుతోంది.