ముంబై: బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం సెషన్ చివరిలో నష్టాల్లోకి జారుకున్నాయి. ఇండెక్స్‌లు లాభాల్లో ఓపెనై, రోజంతా చిన్న రేంజ్‌లో కదిలాయి. ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతుండడంతో పాటు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కి మొగ్గు చూపడంతో మార్కెట్ నష్టాల్లో ముగిసింది.
సెన్సెక్స్ 331 పాయింట్లు (0.39 శాతం) తగ్గి 84,901 దగ్గర సెటిలవ్వగా, నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 25,960 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ కంపెనీల్లో భారత్ ఎలక్ట్రానిక్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్స్ షేర్లు ఎక్కువగా పడ్డాయి.
మరోవైపు టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో షాంఘై ఎస్‌ఎస్‌ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హంగ్ సెంగ్ పాజిటివ్‌గా కదలగా, సౌత్ కొరియా కోస్పీ నష్టాల్లో ముగిసింది. జపనీస్ మార్కెట్లకు సెలవు. యూరప్ మార్కెట్లు గ్రీన్‌లో కదిలాయి.
యూఎస్ ఫ్యూచర్స్ లాభాల్లో ట్రేడయ్యాయి. ఇండియన్ మార్కెట్‌లో ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) శుక్రవారం నికరంగా రూ.1,766 కోట్ల విలువైన షేర్లు అమ్మగా, సోమవారం మరో రూ.4 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
