సెన్సెక్స్ 535 పాయింట్లు పతనం..

సెన్సెక్స్ 535 పాయింట్లు పతనం..

న్యూఢిల్లీ : హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్​తోపాటు ఐటీ షేర్లలో అమ్మకాలు, బలహీన ప్రపంచ పోకడల మధ్య సెన్సెక్స్ బుధవారం 535 పాయింట్లు నష్టపోయింది. ఇది 0.75 శాతం క్షీణించి 71,356.60 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 588.51 పాయింట్లు పడిపోయి 71,303.97 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 148.45 పాయింట్లు పడి 21,517.35 వద్ద ఆగింది. సెన్సెక్స్ కంపెనీల్లో జేఎస్​డబ్ల్యూ  స్టీల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, నెస్లే, హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్,  మారుతీ వెనుకబడి ఉన్నాయి. 

ఇండస్‌‌‌‌‌‌‌‌ఇండ్ బ్యాంక్, ఐటీసీ, భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభాలను సాధించాయి. ఆసియా మార్కెట్లలో, సియోల్  హాంకాంగ్ దిగువన స్థిరపడగా, షాంఘై గ్రీన్‌‌‌‌‌‌‌‌లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు దిగువన ట్రేడవుతున్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు చాలా వరకు నష్టాల్లో ముగిశాయి. "తాజా ట్రిగ్గర్లు లేకపోవడం,  వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌పై ఆందోళనలు పెట్టుబడిదారులను నిరుత్సాహపరిచాయి. చైనా, యూరో జోన్ మాన్యుఫాక్చరింగ్ డేటా బాగా లేకపోవడం వంటి సూచికలు 2024లో ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ గురించి ఆందోళనలను పెంచాయి. 

ముఖ్యంగా, మార్కెట్ ఫెడ్​ మినిట్స్​కోసం మార్కెట్​ ఎదురుచూస్తోంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.   గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌‌‌‌‌‌‌ ధర 0.55 శాతం క్షీణించి 75.47 డాలర్లకు చేరుకుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మంగళవారం రూ. 1,602.16 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. సెన్సెక్స్ మంగళవారం 379.46 పాయింట్లు క్షీణించి 71,892.48 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 76.10 పాయింట్లు తగ్గి 21,665.80 వద్దకు చేరుకుంది.