స్టాక్ మార్కెట్లపై కనిపించని యుద్ధ ప్రభావం

స్టాక్ మార్కెట్లపై కనిపించని యుద్ధ ప్రభావం

వారం తొలి ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు లాభాలార్జించాయి. శుక్రవారం లాభాలతో ముగిసిన సూచీలు ఇవాళ కూడా అదే బాటలో పయనించాయి. ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న యుద్ధ భయాలు, అణ్వస్త్రాలు సిద్ధంగా ఉంచాలని పుతిన్ ఆదేశించారన్న వార్తలతో ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత తేరుకున్నాయి. కనిష్ట స్థాయి వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ లాభాల బాటపట్టింది. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉండటం సూచీలను ప్రభావితం చేయలేకపోయింది. 

ఉదయం 55,329.46పాయింట్ల వద్ద ప్రారంభమైన మార్కెట్లో ట్రేడింగ్ ఆరంభంలో నమోదైన 54,833.50 పాయింట్లు ఇవాళ్టి కనిష్ఠ స్థాయి. కొనుగోళ్ల మద్దతుతో 56,324.54 పాయింట్ల గరిష్ఠ స్థాయిని నమోదుచేసిన సెన్సెక్స్.. మార్కెట్ ముగిసే సమయానికి లాభాన్ని 388.76పాయింట్లకు పరిమితం చేసుకుని 56,247.28 వద్ద ముగిసింది. టాటా స్టీల్, పవర్ గ్రిడ్ షేర్లు 6శాతానికి పైగా లాభపడ్డాయి. రిలయన్స్, టైటాన్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్ వాటాలు లాభాలార్జించాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 135.50పాయింట్ల ప్రాఫిట్ తో 16793.90 వద్ద క్లోజయింది.

మరిన్ని వార్తల కోసం..

ఢిల్లీ హైకోర్టు జడ్జీలుగా నలుగురు జడ్జీల ప్రమాణం

ఆన్‌లైన్‌లోనే పెండింగ్ చలాన్ల పేమెంట్స్