నలుగురు న్యాయమూర్తులు ఇవాళ ( సోమవారం) ఢిల్లీ హైకోర్టు నూతన జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఒక మహిళా జడ్జీ కూడా ఉన్నారు. దీంతో మొత్తం జడ్జీల సంఖ్య 34కి చేరింది. కోర్టుకి 60 మందిని మంజూరు చేయాల్సి ఉంది. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డి.ఎన్. పటేల్ నేతృత్వంలో నీనా బన్సాల్ కృష్ణ, దినేష్ కుమార్ శర్మ, అనూప్ కుమార్ మెండిరట్ట, సుధీర్ కుమార్ జైన్‌లు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ అనూప్ కుమార్ మెండిరట్ట న్యాయ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేంద్ర న్యాయ కార్యదర్శి నియామకానికి ముందు ఆయన ఈశాన్య ఢిల్లీ జిల్లా కోర్టులో జిల్లా, సెషన్స్ జడ్జిగా విధులు నిర్వహించారు. ఢిల్లీ ప్రభుత్వంలో న్యాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. న్యాయ శాఖ మంత్రి గతవారం నలుగురు జడ్జీల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియార్టీ ప్రకారం ఈ నలుగురిని ఢిల్లీ హైకోర్టు జడ్జీలుగా నియమిస్తున్నామని, సంబంధిత కార్యాలయాల బాధ్యతలను స్వీకరించిన నాటి నుండి అమల్లోకి వస్తుందని ఆ నోటిఫికేషన్‌లో తెలిపింది.
మరిన్ని వార్తల కోసం..
