రికార్డు స్థాయిలో ముగిసిన సెన్సెక్స్‌‌, నిఫ్టీలు

రికార్డు స్థాయిలో ముగిసిన సెన్సెక్స్‌‌, నిఫ్టీలు

ముంబై : మార్కెట్‌ పై ఇంకా ఎన్నికల ఫలితాల ప్రభావం కొనసాగుతోంది. దీంతో సోమవారం సెన్సెక్స్‌‌, నిఫ్టీలు రెండూ రికార్డు స్థాయిలో ముగిశాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలో ని బీజేపీ ఘన విజయంతో స్టాక్‌ మార్కెట్లో ఉత్సాహం నెలకొంది. స్థిరమైన ప్రభుత్వం తో ఆర్థిక వృద్ధికి మెరుగైన అవకాశాలు ఉంటాయనే భావనే ఈ ఉత్సాహానికి కారణమని ఎనలిస్టు లు చెబుతున్నా రు. సోమవారం సెన్సె క్స్‌‌249 పాయింట్లు ( 0.63 శాతం) లాభపడి 39683.29 పాయింట్లు , నిఫ్టీ 81 పాయింట్లు (0.68 శాతం )లాభపడి  11924.75 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఏడాది చూస్తే సెన్సెక్స్‌‌, నిఫ్టీలు ఇప్పటిదాకా 10 శాతం చొప్పున పెరిగాయి. మోడీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావడంతో మార్కెట్లో సెంటిమెంట్‌ బలపడిందని ఛాయిస్‌ బ్రోకింగ్‌ రిసెర్చ్‌‌ ఎనలిస్ట్‌‌ రాజ్‌ నాథ్‌ యాదవ్‌ చెప్పా రు. డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపు, జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లో కొంత ఒడిదుడుకులు ఉంటాయని అభిప్రాయపడ్డారు.

ఆర్థిక వ్యవస్థకు మళ్లీ ఉత్తేజం కలిగించడమే ప్రభుత్వం ముందుండే ప్రధాన సవాలని విశ్లేషకులు చెబుతున్నా రు. వ్యవస్థను పట్టి పీడిస్తున్న అసలు సమస్యలను విశ్లేషించి, పరిష్కారాలను కనుక్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. సోమవారం ట్రేడింగ్లో బీఎస్‌ ఈ మిడ్‌ కాప్‌ ఇండెక్స్‌‌ 1.1 శాతం, స్మాల్‌ కాప్ ఇండెక్స్‌‌ 1.8 శాతం పెరిగాయి. గత రెం డు వారాలుగా ఈ రెండు ఇండెక్స్‌‌లూ 8.5 శాతం పెరిగినట్లు. ఈ మధ్య బాగా పెరిగినా, చాలా మిడ్‌ కాప్‌ ,స్మాల్‌ కాప్‌ షేర్లలో పెట్టుబడికి ఇదే అనువైన సమయమని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రిసెర్చ్‌‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.

మార్కెట్లో చాలా షేర్ల ధరలు పెరగ్గా, యునైటెడ్‌ బ్రూవరీస్‌ షేర్లు 3.6 శాతం, జీఎం బ్రూవరీస్‌ 2శాతం, ఆరడికో ఖైతాన్‌ 2.5 శాతం తగ్గాయి. మద్యపాన నిషేధం అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించడంతోనే ఈ షేర్ల ధరలు తగ్గాయంటున్నారు.