పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్ 

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్ 

స్టాక్ మార్కెట్లో బుల్  పరుగులు పెట్టింది. అన్నీ సానుకూల సంకేతాలే ఉండటంతో ఆద్యంతం లాభాల్లో  ట్రేడయింది. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉండటం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీల విలీనం, గతవారం క్రూడాయిల్ ధరలు తగ్గడం తదితర పరిణామాలు మార్కెట్కు కలిసొచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టారు. ఉదయం 59,764.13 పాయింట్ల వద్ద ప్రారంభమైన మార్కెట్లో ట్రేడింగ్ ఆరంభంలో నమోదైన 59,760.22 ఇవాళ్టి కనిష్ఠ స్థాయి.  మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభం నుంచి కనిపించిన జోరు చివరి వరకు తగ్గలేదు. ఒక దశలో 60,845.10 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సెన్సెక్స్.. ట్రేడింగ్ ముగిసే సమయానికి 1335.05 పాయింట్ల ప్రాఫిట్తో 60,611.74 వద్ద క్లోజయింది.

ఇక షేర్ల విషయానికొస్తే.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ షేర్లు 9 శాతానికి పైగా లాభపడ్డాయి. కొటక్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలీవర్, సన్ ఫార్మా, టాటా స్టీల్ వాటాలు ప్రాఫిట్ గెయిన్ చేశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా భారీగా లాభపడి 18వేల మార్కు దాటింది. 382.95పాయింట్ల ప్రాఫిట్తో 18,053.40 వద్ద ముగిసింది.