Tillu Square Censor: టిల్లు స్క్వేర్ సెన్సార్ కంప్లీట్.. ఏదో అనుకుంటే ఏదో జరిగింది!

Tillu Square Censor: టిల్లు స్క్వేర్ సెన్సార్ కంప్లీట్.. ఏదో అనుకుంటే ఏదో జరిగింది!

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Soddu Jonnalagadda) హీరోగా వచ్చిన డీజే టిల్లు(DJ Tillu) ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు విమల్ కృష్ణ(Vimal krishna) తెరకెక్కించిన ఈ టిపికల్ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. ఇక డీజే టిల్లుగా సిద్దు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ హంగామాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు సిద్దు. 

డీజే టిల్లు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా చేస్తున్నాడు సిద్దు. ఈ క్రేజీ సీక్వెల్ ను దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నాడు. మొదటి పార్ట్ ను నిర్మించిన సితార ఎంటెర్టైన్మెంట్స్ ఈ సీక్వెల్ ను కూడా నిర్మిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మార్చ్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో తాజాగా టిల్లు స్క్వేర్ సెన్సార్ చేశారు మేకర్స్. ప్రమోషన్స్ లో భాగంగా టిల్లు స్క్వేర్ నుండి వచ్చిన టీజర్, సాంగ్స్ లో లిప్ లాక్స్, గ్లామర్ షో చూసి ఈ సినిమాకు ఖచ్చితంగా ఏ సర్టిఫికెట్ ఇస్తారని భావించారు ఆడియన్స్. కానీ అనూహ్యంగా సెన్సార్ ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ను జరీ చేసింది. దీంతో ఆడియన్స్ అవాక్కవుతున్నారు. 

సినిమాలో కాస్త గ్లామర్ డోస్ ఎక్కువగానే ఉంటుంది అని భావించిన యూత్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. మరి టీజర్, సాంగ్స్ లో చూపించినంతగా రిమాటిక్ పాళ్ళు ఎక్కువగా ఉండాలి లేవని టాక్ నడుస్తోంది. కేవలం ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడం కోసం మాత్రమే ఆలాంటి సీన్స్, సాంగ్స్ రిలీజ్ చేశారని, ఎదో అనుకుంటే ఇంకేదో జరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.