ఆవుల కోసం ప్రత్యేక టాయిలెట్స్​

ఆవుల కోసం ప్రత్యేక టాయిలెట్స్​

ఆవులు, గేదెలు వంటి జంతువులు ఎక్కడ పడితే అక్కడే యూరిన్‌‌ పాస్‌‌ చేసేస్తాయి. కానీ జర్మనీలోని ఆవులు మాత్రం టాయిలెట్‌‌కు వెళతాయట. జర్మన్‌‌ సైంటిస్టులు రీసెర్చ్‌‌ కోసమే ఆవులను టాయిలెట్‌‌కు వెళ్లేలా అలవాటు చేశారు. ఇప్పుడు వాటి యూరిన్‌‌లో ఉండే రసాయనాలపై వారు రీసెర్చ్‌‌ చేస్తున్నారు.

లాభాలు ఎన్నో
ఆవు పంచకం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. వాటి నుంచి వచ్చే వ్యర్థాలు అమ్మోనియాను ఉత్పత్తి చేస్తాయనేది కూడా తెలిసిన అంశమే అయినా అది వేస్ట్‌‌ అయిపోతుంటే ఇన్నాళ్లూ చూస్తూ ఊరుకున్నాం. ఇప్పుడలా కాదు, వాటికి టాయిలెట్స్‌‌ వచ్చేశాయి.  జర్మనీ రీసెర్చర్లు వీటికోసం ‘మూలూ’ అనే గ్రీన్‌‌ మ్యాట్‌‌తో ఉన్న ప్రత్యేక టాయిలెట్‌‌ను అభివృద్ధి చేశారు. ఆవు దానిపై యూరిన్ పాస్‌‌ చేయగానే గ్రీన్‌‌ మ్యాట్‌‌ ద్వారా యూరిన్‌‌ నేలలోకి ఇంకుతుంది. ఈ మూలూ టాయిలెట్‌‌లు యూరిన్‌‌ అబ్జార్బ్‌‌ చేసుకున్నప్పుడు సూక్ష్మజీవులు ఈ రసాయనంతో గ్రీన్‌‌ హౌస్‌‌ గ్యాస్‌‌ను నైట్రస్‌‌ ఆక్సైడ్‌‌గా మారుస్తాయి. దీని కోసం రీసెర్చర్స్‌‌ ఆవు దూడలకు ట్రైనింగ్‌‌ ఇచ్చారు. ఈ క్రమంలో 16 దూడల్లో 11 దూడలు కొన్ని వారాల్లోనే టాయిలెట్‌‌ యూజ్‌‌ చేస్తున్నాయట. షుగర్‌‌‌‌ ఆశ చూపి వాటిని టాయిలెట్‌‌లోకి వచ్చేలా చేశారు. అవి ఇంత ఈజీగా టాయిలెట్‌‌ను అలవాటు చేసుకుంటాయని ఊహించలేదని.. ఇది మామూలు సక్సెస్‌‌ కాదంటున్నారు సైంటిస్టులు. జనరల్‌‌గా ఓపెన్‌‌ ప్లేస్‌‌లో యూరిన్‌‌ చేసే వాటికి హెడ్‌‌ఫోన్స్‌‌ తగిలించి విపరీతమైన శబ్దాలను వినిపించేవారట, అయినా అవి లెక్క చేయకపోవడంతో నీటి స్ప్లాష్​లతో బెదిరించి బయట యూరిన్‌‌ చేయకుండా ఆపగలిగారట. అమ్మోనియా ఉద్గారాలు వ్యవసాయానికి ఎంతో హెల్ప్‌‌ చేస్తాయి.  అందుకే రైతులు ఎక్కువగా పశువులు పెంచుతుంటారు. ఇప్పుడు రీసెర్చర్స్‌‌ నిర్మించిన మూలూ టాయిలెట్స్‌‌తో మరిన్ని ఉపయోగాలున్నాయని జర్మన్‌‌ యానిమల్‌‌ బయాలజీ రీసెర్చర్స్‌‌ అంటున్నారు. ఇక్కడితో ఆగకుండా వీరు ఆవుల ఫుడ్‌‌ గురించి కూడా రీసెర్చ్‌‌ చేస్తున్నారు. వాటికి సముద్ర నాచును ఫుడ్‌‌గా ఇస్తే అవి వాతావరణానికి అనుకూలంగా మనగలుగుతాయని సైంటిస్టులు చెబుతున్నారు.