లండన్ : సెర్బియా స్టార్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్.. తన కోచ్ గోరాన్ ఇవానిసెవిక్తో విడిపోయాడు. 2018లో ఇవానిసెవిక్.. జొకో కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. దాదాపు ఆరేళ్ల పాటు కొనసాగిన ఈ ఇద్దరి కాంబినేషన్లో జొకోవిచ్ 12 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గాడు. ‘కొన్ని రోజుల నుంచి ఇవానిసెవిక్తో కలిసి పని చేయడం మానేశా. మా ఆన్ కోర్ట్ కెమిస్ట్రీలో హెచ్చు తగ్గులు వచ్చాయి. కానీ మా స్నేహం ఎప్పుడూ ధృడంగా ఉంటుంది.
ఇన్నాళ్లూ నా ఉన్నతికి తోడ్పడిన సెవిక్కు ధన్యవాదాలు’ అని జొకోవిచ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇవానిసెవిక్ కోచింగ్‌లోనే జొకోవిచ్ రికార్డు స్థాయిలో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు. ఇక జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లో ఓడిన జొకో ఇటీవల జరిగిన ఇండియానా వేల్స్‌లోనూ థర్డ్ రౌండ్లో ఓటమిపాలయ్యాడు. ప్రస్తుతం అతను క్లే కోర్టు సీజన్‌కు రెడీ అవుతున్నాడు. ఇక 2001లో వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన ఇవానిసెవిక్ వింబుల్డన్ టైటిల్ గెలిచి అందర్ని ఆశ్చర్యపరిచాడు.