ఫ్లిప్కార్ట్లో మహళా సంఘాల వస్తువుల విక్రయం

ఫ్లిప్కార్ట్లో మహళా సంఘాల వస్తువుల విక్రయం

ఎఫ్పీవోలు సేకరించిన ధాన్యం, మహిళా సంఘాల వస్తువులను విక్రయించేందుకు ఫ్లిప్కార్ట్ ముందుకు రావడం సంతోషించమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దీని వల్ల దళారి వ్యవస్థ లేకుండా పోతుందని చెప్పారు. సెర్ప్ ఆధ్వర్యంలో మహిసంఘాల వస్తువులు, ఎఫ్పీవోలు సేకరించిన ధాన్యాన్ని విక్రయించాలని ఫ్లిప్కార్ట్ నిర్ణయించింది. మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో సెర్ప్ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా,  ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. 

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ..మహిళా ప్రోత్సహాకానికి 15వేల కోట్లు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 46వేల మహిళా గ్రూపులు ఉన్నాయని.. అందుకు వ్యాపారం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు.ఎన్టీఆర్ హయాంలో లోన్లు స్టార్ట్ అయ్యాయన్న మంత్రి.. అప్పుడు 10వేల లోన్లు ఇస్తే ఇప్పుడు లక్షల్లో ఇస్తున్నట్లు తెలిపారు. ఇక రాష్ట్రంలో 24గంటల విద్యుత్, వ్యవసాయానికి సరిపడా నీళ్లు ఇస్తున్నట్లు చెప్పారు. ‘‘నాకు 100 ఎకరాల భూమి ఉంది.  గతంలో 10 ఎకరాల్లో మాత్రమే పంట పండేది. కానీ ఇప్పుడు విద్యుత్, నీళ్లు సరిపడా ఉండడంతో 100 ఎకరాలు పంట వేస్తున్నా’’ అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.