పేద ప్రజల సేవ కోసమే కాకా ఫౌండేషన్: డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి

పేద ప్రజల సేవ కోసమే కాకా ఫౌండేషన్: డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి

పెద్దపల్లి, వెలుగు: కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు సేవ చేసేందుకే కాకా ఫౌండేషన్ ఏర్పాటు  చేసినట్టు కాకా ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ  డాక్టర్​ వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి, కమ్మర్​ఖాన్​ పేటలో వివేక్​ పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామంలో రేణుక ఎల్లమ్మ దేవాలయంలో కాకా ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన నిర్మాణాలను ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోకి వెళ్లినపుడు వెంకటస్వామి చేసిన సేవలను ఇప్పటికి ప్రజలు గుర్తు చేసుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.

ALSO READ:కేసీఆర్‌‌, కేటీఆర్‌‌ వరంగల్‌‌కు ఎందుకొస్తలే ?: ఎర్రబెల్లి ప్రదీప్‌‌రావు

వారి సేవలను ఆదర్శంగా తీసుకుని ఫౌండేషన్ కార్యక్రమాలను  మరింత ముందుకు తీసుకుపోతామని తెలిపారు. ఫౌండేషన్ ఆలోచనలను తమ కుటుంబ సభ్యులు కూడా స్వాగతిస్తూ, వారు కూడా వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. అనంతరం  గ్రామంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం కోసం రూ.50వేలను గౌడ సంఘానికి అందించారు.  కటికనపెల్లిలో 20 మంది యువకులు వివేక్​ వెంకటస్వామి ఆధ్యర్యంలో బీజేపీలో చేరారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమంలో కటికెనపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు చేపురి తిరుపతి, నాయకులు మల్లేశం, కృష్ణ, జంగిలి రాజయ్య, కిషోర్, లింగయ్య బీజేపీ నాయకులు కాడే సూర్యనారాయణ, మల్లేశం, తిరుపతి, స్వామి తదితరులు పాల్గొన్నారు