న్యూఢిల్లీ: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీలు) సీనియర్ఎగ్జిక్యూటివ్లు, లీడర్‌షిప్ పొజిషన్లలోని వారు హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోనే ఎక్కువగా ఉన్నారని వెల్లడయింది. భారతదేశంలోని మొత్తం జీసీసీ లీడర్‌షిప్ స్థానాల్లో ఈ రెండు నగరాలు వాటా దాదాపు 70 శాతం ఉందని క్వెస్ కార్ప్ రిపోర్ట్ వెల్లడించింది. దీని ప్రకారం.. హైదరాబాద్‌లో నియామకాల వృద్ధి వార్షికంగా 42 శాతం పెరిగింది. బెంగళూరు ట్యాలెంట్ హబ్‌గా ఎదిగింది.
ఇది మార్కెట్ సగటు కంటే 8-–10 శాతం ఎక్కువ. ఫైనాన్స్, రిస్క్ సంబంధిత పనులకు చెన్నై అడ్డాగా ఉందని తెలిపింది. పూణే అనలిటిక్స్, నాణ్యత హామీలో బలాన్ని పెంచుకుంటోంది. కోచి, కోయంబత్తూరు లాంటి టైర్ 2 నగరాలు సహాయక కేంద్రాలుగా మారుతున్నాయి. జీసీసీలకు జనరేటివ్ ఏఐ, ఎల్ఎల్ఎం ఇంజనీరింగ్ వంటి కొత్త టెక్నాలజీల ఎక్స్పర్టులు దొరకడం కష్టంగా మారింది.
దీనివల్ల కీలకమైన స్థానాలు భర్తీ కావడానికి 90 నుంచి 120 రోజులు పడుతోంది. జీసీసీలు ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య పెంపు కంటే ఏఐ, క్లౌడ్ వంటి కీలక రంగాల్లో సామర్థ్యం సృష్టించడంపై దృష్టి పెడుతున్నాయని క్వెస్ తెలిపింది.
