ఫార్మా కంపెనీలో మంటలు.. ఏడుగురికి తీవ్ర గాయాలు

ఫార్మా కంపెనీలో మంటలు.. ఏడుగురికి తీవ్ర గాయాలు

జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం జరిగింది. శ్రీధర్ ఫార్మా కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా.. ముగ్గురికి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్న పోలీసులు.. శ్రీధర్ ఫార్మా కంపెనీకి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. కెమికల్ డ్రమ్ములు పేలాయా..లేక రియాక్టర్లు పేలి ప్రమాదం జరిగిందా అని ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు.

విజయవాడ జిల్లా నిడమనూరు జాతీయ రహదారిపై ఓ లారీ తగలబడింది. టైర్లకు నిప్పు అంటుకోని లారీ మొత్తం వ్యాప్తించాయి. దీంతో వెంటనే ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పాయి. విజయవాడ నుంచి ఏలూరు వెళ్తుండగా ఘటన జరిగింది.