
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. AI వాడకంతో ఫేక్ వీడియోల సృష్టి పెరిగిపోయిందన్నారు. డీప్ ఫేక్ వీడియోలతో వ్యక్తిగత అనుభవాలను చెప్తూ AI మోసాలు, దుర్వినియోగంపై హెచ్చరించారు. భారత్ AIలో కీరోల్ ప్లేచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.. ఈ క్రమంలో AI తో మోసాలకు, దుర్వినియోగం జరగకుండా బలమైన రక్షణ వ్యవస్థ అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు.
మంగళవారం ( అక్టోబర్7) గుజరాత్ GIFT సిటీ విదేశీ కరెన్సీ పరిష్కార వ్యవస్థను కూడా ప్రారంభించిన సందర్భంగా AI తో లాభాలు, నష్టాలు, ఫేక్ వీడియోలపై మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) దుర్వినియోగం పెరుగుతుండటంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న తన అనేక డీప్‌ఫేక్ వీడియోలను తాను చూసినట్లు ఆమె చెప్పారు. AI అపారమైన అవకాశాలను అందిస్తున్నప్పటికీ మోసాలకు దారితీసే తీవ్రమైన ప్రమాదాలను కూడా కలిగి ఉంటుందని హెచ్చరించారు.
AI స్టాక్ కేంద్రీకృత విధానం ప్రపంచంలోని దక్షిణ భాగానికి భారతదేశాన్ని మార్గదర్శకుడిగా మార్చగలదని అన్నారు.
గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో విదేశీ కరెన్సీ సెటిల్‌మెంట్ సిస్టమ్ (FCSS)ను ప్రారంభించారు నిర్మలా సీతారామన్. ఇది అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం, విదేశీ కరెన్సీ లావాదేవీల రియల్-టైమ్ సెటిల్‌మెంట్‌ను ప్రారంభించడం ద్వారా వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపర్చే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.
FCSS అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం (IFSC)లో భాగంగా పనిచేస్తుంది. విదేశీ కరెన్సీ లావాదేవీల వ్యవస్థను కలిగి ఉన్న హాంకాంగ్, టోక్యో ,మనీలా వంటి ఎంపిక చేయబడిన ప్రపంచ ఆర్థిక కేంద్రాల సరసన భారత్ ను ఉంచుతుందన్నారు. ప్రస్తుతంIFSCలోని సంస్థల ద్వారా జరిగే ఆ లావాదేవీలు మధ్యవర్తులు ఉన్న కరస్పాండెంట్ బ్యాంకింగ్ ఏర్పాట్ల ద్వారా ప్రాసెస్ చేస్తున్నారు. దీంతో లావాదేవీల జాప్యం జరుగుతోంది..కొత్త వ్యవస్థ ఈ ప్రక్రియను సులభతరం చేస్తోందన్నారు నిర్మలా సీతారామన్.