ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీ

ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీ

అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ బదిలీ అయ్యారు. మైనారిటీ సంక్షేమ ప్రత్యేక కార్యదర్శిగా ఇంతియాజ్‌ కొత్తస్థానంలో చేరనున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ నివాస్‌ బదిలీ అయి కృష్ణా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా ఎల్‌ఎస్‌ బాలాజీరావు, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా నాగలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాల డైరక్టర్‌గా గంధం చంద్రుడు, పాడేరు ఐటీడీఏ పీవోగా గోపాలకృష్ణ లను నియమించారు. 
సీనియర్ ఐఏఎస్ అధికారులతోపాటు.. రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ కింద ఇళ్ల నిర్మాణం వేగంగా జరిపేందుకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించారు. ప్రతి జిల్లాలో గృహ నిర్మాణ శాఖను ఐఏఎస్ స్థాయి అధికారి జాయింట్ కలెక్టర్ హోదాలో పర్యవేక్షించనున్నారు. కొత్తగా నియమితులైన జాయింట్ కలెక్టర్ వివరాలు ఇలా ఉన్నాయి. 

ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)గా కెఎస్ విశ్వనాధన్
కడప జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)గా జాహ్న ధ్యానచంద్ర
తూర్పగోదావరి జిల్లా జేసీగా (హౌసింగ్)గా  జాహ్నవి
కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)గా ఎన్.మౌర్య
కృష్ణ జిలా జేసీ (హౌసింగ్)గా ఎన్.అజయ్ కుమార్
గుంటూరు జిల్లా జేసీ (హౌసింగ్)గా అనుపమ అంజలి
చిత్తూరు జిల్లా జేసీగా (హౌసింగ్)గా ఎస్.వెంకటేశ్వర్
నెల్లూరు జిల్లా జేసీ (హౌసింగ్)గా వైదేహ్ ఖరే
పశ్చిమ గోదావరి జిల్లా జేసీ (హౌసింగ్)గా సూరజ్ ధననుంజయ్
విశాఖ జిల్లా జేసీగా (హౌసింగ్)గా కల్పనా కుమారి
విజయనగరం జిల్లా జేసీ (హౌసింగ్)గా మయూర్ అశోక్
శ్రీకాకుళం జిల్లా జేసీ (హౌసింగ్)గా హిమాన్షు కౌశిక్