కుంటాల, వెలుగు: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ గాలులకు చెట్లు నేలకూలాయి. కల్లూర్– కుంటాల ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు విరిగిపడ్డ చెట్లను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
