
- పైప్‌లైన్‌కు క్రాక్ ఏర్పడి భారీగా లీకవుతున్న మురుగునీరు
- అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుల ఆరోపణ
గండిపేట, వెలుగు: ఓ బిల్డర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిబంధనలకు పాతరేశాడు. సెల్లార్ కోసం డ్రైనేజీ పైపులైన్ అంచు వరకు తవ్వించాడు. ఫలితంగా మురుగునీరు పెద్ద ఎత్తున లీకవుతూ చెరువును తలిపస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడ కట్ట మైసమ్మ ఎదుట ఓ బిల్డర్ హైరైజ్ బిల్డింగ్ నిర్మిస్తున్నాడు. దాని పక్క నుంచే ప్రెస్టేజ్ విల్లాస్ నుంచి ప్రారంభమై రాక్ చర్చి నుంచి ఓంనగర్, సరస్వతి, రాత్రి, శ్రీనివాసం ఏంక్లేవ్ తదితర 20 కాలనీల నుంచి డ్రైనేజీ పైప్లైన్ఉంది. మురుగునీరు మూసీనదిలో కలిసేలా దీన్ని కొన్నేండ్ల క్రితం వేశారు.
అయితే కొన్ని రోజులుగా బిల్డింగ్ పనులు చేయిస్తున్న బిల్డర్సెల్లార్కోసం నిబంధనలకు విరుద్ధంగా ఆ పైపులైన్అంచు వరకు తవ్వించాడు. దీంతో బ్యాలెన్స్తప్పి, పైప్లైన్మధ్యలో క్రాక్ ఏర్పడి డ్రైనేజీ నీరు భారీగా లీకవుతోంది. పైప్లైన్కింది నుంచి కూడా మట్టి తీశారని స్థానికులు అంటున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సిన మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి బిల్డర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.