యూనివర్సిటీలలో స్టాఫ్ ను రిక్రూట్ చేయడం లేదు

యూనివర్సిటీలలో స్టాఫ్ ను రిక్రూట్ చేయడం లేదు
  • ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా అధ్యక్షుడు సాను 

కరీంనగర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు విద్యా వ్యతిరేక చ‌ట్టాల‌ను తీసుకొస్తోందని, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసేవరకు పోరాటం ఆగదని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను అన్నారు. కరీంనగర్ లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎస్ఎఫ్‍ఐ రాష్ట్ర మహాసభల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టసభల్లో అంగబలం ఉందని విద్యను ప్రైవేటైజేషన్​చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. నేడు పేద, బడుగు బలహీనవర్గాల స్టూడెంట్స్​ ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంద‌న్నారు.

స్టూడెంట్లకు స్కాల‌ర్ షిప్, ఫెలోషిప్లు రాకపోవడంతో చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు. విదేశీ యూనివర్సిటీలను తీసుకువచ్చి స్వదేశీ యూనివర్సిటీలను దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. యూనివర్సిటీలలో స్టాఫ్ ను రిక్రూట్ చేయడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లో ఉన్నాయ‌న్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ వర్మ, కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గజ్జల శ్రీకాంత్,  శనిగరపు రజినీకాంత్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ పాల్గొన్నారు.