- సర్టిఫికెట్లను వెరిఫై చేయాలని డిమాండ్
బేగంబజార్, వెలుగు: రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్ట్లెక్చరర్ల సర్టిఫికెట్లను కరెక్ట్‌గా వెరిఫై చేయాలని ఎస్ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. ఫేక్సర్టిఫికెట్లతో రెగ్యులరైజ్ అయినట్లు తేలితే చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించింది. ఎస్ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజినీకాంత్ మాట్లాడుతూ.. 2023లో రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న 3,800 మంది కాంట్రాక్ట్లెక్చరర్లను రెగ్యులరైజ్ చేశారన్నారు. వీరిలో తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలిన 35 మందిని ప్రభుత్వం ఇప్పటికే తొలగించిందని తెలిపారు.
మరో 700 నుంచి 800 మంది ఇతర రాష్ట్రాల్లో పీజీ చదివినట్లు సర్టిఫికెట్లు సృష్టించి రెగ్యులరైజ్ అయ్యారన్న ఆరోపణలున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. అఫిలియేషన్ లేని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు అనుమతులున్నట్లు ప్రచారం చేసుకుంటూ విద్యార్థులను చేర్పించుకుంటున్నాయని, వాటిపైనా యాక్షన్తీసుకోవాలన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.కిరణ్, గర్ల్స్ కన్వీనర్ మమత, కార్యదర్శివర్గ సభ్యుడు జి.కార్తీక్, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్ గువేరా, రమేశ్తదితరులు పాల్గొన్నారు.
