రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ నటి షబానా అజ్మీకి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ నటి షబానా అజ్మీకి తీవ్ర గాయాలు

బాలీవుడ్ సీనియర్ నటీ షబానా అజ్మీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబై- పూణే హైవేపై షబానా అజ్మీ ఆమె భర్త జావెద్ అక్తర్ ప్రయాణిస్తున్నారు. కహలాపూర్ టోల్ ప్లాజా సమీపంలో షబానా ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్ వెనక వైపు నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షబానా అజ్మీ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన వాహనదారులు అత్యవసర చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.   ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.  ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.