
- బాగా సదువుకో బిడ్డా..! కొడుకుతో షబ్నమ్ అలీ
- తల్లిని కలిసేందుకు జైలు కెళ్లిన బాలుడు
న్యూఢిల్లీ: తల్లి కరుడుగట్టిన నేరస్తురాలైనా.. ఆమెను క్షమించి విడిచిపెట్టాలని కోరుతున్నాడు ఆ చిన్నారి. ఏడుగురిని చంపిన కేసులో ఉరికంబం ఎక్కబోతున్న షబ్నమ్‌ను ఆమె 12 ఏళ్ల కొడుకు జైలులో కలిశాడు. తన బాగోగులు చూసుకుంటున్న ఉస్మాన్ అనే వ్యక్తితో కలిసి ఆదివారం రాంపూర్ జైలుకు వెళ్లాడు. బాగా చదువుకుని ప్రయోజకుడివి అవ్వాలంటూ తన తల్లి చెప్పిందన్నాడు. ప్రెసిడెంట్ అంకుల్ పెద్ద మనసు చేసుకుని అమ్మను క్షమించాలని మళ్లీ కోరుతున్నా అన్నాడు. ఉరి తీస్తారన్న వార్తలు రాగానే తల్లీబిడ్డలు కలిసేందుకు ఎంతో ప్రయత్నించారని రాంపూర్ జైలు సూపరింటెండెంట్ పీడీ సలోనియా చెప్పారు. తాను ఈ నేరం చేయలేదని, కావాలని ఇరికించారని తన కొడుకుతో షబ్నమ్ చెప్పిందన్నాడు బాబును చూసుకుంటున్న ఉస్మాన్. ప్రేమ కోసం తన తల్లి, తండ్రి, అన్నలు, వదిన, తన పదినెలల మేనల్లుడు సహా ఏడుగురిని హత్య చేసిన కేసులో షబ్నమ్‌కు ఆమ్రోహ సెషన్స్ కోర్టు మరణ శిక్ష వేసింది. ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టు, సుప్రీం కోర్టులో సవాల్ చేసినా నిలబడలేదు. ప్రెసిడెంట్ క్షమాభిక్ష పెట్టలేదు. దీంతో ఉరి నుంచి బయటపడే దారులన్నీ మూసుకుపోయినట్టైంది. మధుర జైలు అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.
For More News..