హైదరాబాద్‌‌ ఆతిథ్యం, ఆహారం బాగుంది : షాదాబ్ ఖాన్‌‌

హైదరాబాద్‌‌ ఆతిథ్యం, ఆహారం బాగుంది  : షాదాబ్ ఖాన్‌‌

 

  • రోహిత్‌‌ ఇష్టం.. ఫామ్‌‌లోకి వస్తే ఆపడం కష్టం

    
హైదరాబాద్‌‌, వెలుగు: టీమిండియా కెప్టెన్ రోహిత్‌‌ శర్మపై పాకిస్తాన్‌‌ వైస్‌‌ కెప్టెన్‌‌ షాదాబ్‌‌ ఖాన్‌‌  తన అభిమానాన్ని చాటుకున్నాడు. రోహిత్‌‌  తనకు ఇష్టమైన బ్యాటర్‌‌ అని, ఒక్కసారి  ఫామ్‌‌లోకి వస్తే అతడిని ఆపడం కష్టమన్నాడు. ఓ బౌలర్‌‌గా తను జోరందుకోకముందే  ఔట్‌‌ చేయాలని అనుకుంటున్నట్టు తెలిపాడు.  ‘నేను రోహిత్ శర్మను చాలా ఆరాధిస్తాను. వరల్డ్​ టాప్​  బ్యాటర్లలో అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం. ఒక్కసారి సెట్ అయితే తను చాలా ప్రమాదరకంగా మారుతాడు. నేను లెగ్ స్పిన్నర్‌‌ని కాబట్టి ఇటీవలి ఫామ్‌‌ దృష్ట్యా కుల్దీప్ యాదవ్‌‌ను ఇష్టపడుతా’ అని  ఆదివారం ఉప్పల్‌‌ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పాడు. 

బాలీవుడ్‌‌ సినిమాలను చూస్తానన్న షాదాద్​ వరల్డ్‌‌కప్‌‌ కోసం వచ్చిన తమకు హైదరాబాద్‌‌ ప్రజలు స్వాగతం పలికిన తీరును మర్చిపోలేనన్నాడు. ఇక్కడి ఆతిథ్యం, ఆహారం కూడా చాలా బాగుందని  తెలిపాడు. ఆసియా కప్‌‌లో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకొని వరల్డ్​కప్​లో బాగా రాణిస్తామన్నాడు.  ఇక మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగే వార్మప్‌‌ మ్యాచ్‌‌ కోసం పాక్‌‌ టీమ్‌‌ పూర్తి స్థాయి ప్రాక్టీస్‌‌ సెషన్‌‌లో పాల్గొన్నది. కాగా, సోమవారం గువాహతిలో జరిగే వార్మప్‌‌ మ్యాచ్‌‌లో బంగ్లాదేశ్‌‌, ఇంగ్లండ్‌‌ తలపడనుండగా, తిరువనంతపురంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా పోటీ పడనున్నాయి. మంగళవారం నెద్లర్లాండ్స్‌‌తో జరిగే వార్మప్‌‌ కోసం టీమిండియా తిరువనంతపురం చేరుకుంది.