నిర్భయంగా ఓటు వేయండి : ఏసీపీ లక్ష్మీనారాయణ

నిర్భయంగా ఓటు వేయండి : ఏసీపీ లక్ష్మీనారాయణ
  • షాద్​నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ  

షాద్ నగర్, వెలుగు: స్థానిక ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని షాద్ నగర్ ఏసీపీ ఎస్.లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని మొగలిగిద్ద, ఎల్లంపల్లి, చౌలపల్లి, కిషన్ నగర్ గ్రామాల్లో గురువారం ఏసీపీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో షాద్ నగర్ సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 60 మంది పోలీస్ సిబ్బందితో పోలీసు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే కవాతు నిర్వహించినట్లు 
తెలిపారు.