అఖండ 2 విలన్, ఆది పినిశెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డ్రైవ్’ (DRIVE). మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్. జెనూస్ మొహమద్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. డిసెంబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు.
తన తండ్రి నెలకొల్పిన మీడియా సంస్థను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తుంటాడు ఆది పినిశెట్టి. అతను కారు డ్రైవింగ్‌లో ఉన్న సమయంలో తన ల్యాప్ ట్యాప్ హ్యాక్ అవుతుంది. సౌత్ ఇండియాలో పేరున్న అతని సంస్థ అకౌంట్స్‌ను గుర్తు తెలియని వ్యక్తి హ్యాక్ చేస్తాడు. దీంతో ఆ సంస్థ గౌరవం, క్రెడిబిలిటీ ప్రశ్నార్థకంలో పడతాయి.
ఆ హ్యాకర్ ఎవరు, ఎందుకు టార్గెట్ చేశాడు అనేది ఇంటరెస్టింగ్‌గా టీజర్‌ను కట్ చేశారు. ఆ హ్యాకర్ చెప్పినట్టుగా డ్రైవ్ చేస్తూనే.. తన సమస్య నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అనేది మూవీ మెయిన్ కాన్సెప్ట్‌గా తెలుస్తోంది. థ్రిల్ చేసే ఈ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచింది. రాజా చెంబోలు, కమల్ కామరాజు, అనీష్ కురువిల్లా ఇతర పాత్రలు పోషించారు. ఓషో వెంకట్ సంగీతం అందించాడు.
