
దుబాయ్: ఇండియా విమెన్స్ టీమ్ బిగ్ హిట్టర్ షెఫాలీ వర్మ.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్–10లో చోటు సంపాదించింది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో షెఫాలీ (655) నాలుగు ప్లేస్‌లు మెరుగుపడి 9వ ర్యాంక్‌లో నిలిచింది.
ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో 158.56 స్ట్రైక్ రేట్‌తో 176 రన్స్ చేయడం షెఫాలీకి కలిసొచ్చింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (767) మూడో ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేదు. జెమీమా రొడ్రిగ్స్ (625) రెండు ప్లేస్‌లు కిందకు దిగజారి 14వ ర్యాంక్‌లో నిలవగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (613) 15వ ర్యాంక్‌కే పరిమితమైంది. బౌలింగ్‌లో అరుంధతి రెడ్డి (533) నాలుగు ప్లేస్‌లు పైకి ఎగబాకి 39వ ర్యాంక్‌లో నిలిచింది. 80 మందితో కూడిన ఆల్‌రౌండర్స్ లిస్ట్‌లో 26వ ర్యాంక్‌లో ఉంది. దీప్తి శర్మ (732), రాధా యాదవ్ (686) వరుసగా 3, 15వ ర్యాంక్‌ల్లో ఉన్నారు.