
పఠాన్ సినిమా బ్లాక్ బాస్టర్‌తో మాంచి ఊపు మీదున్న బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ వరుస బెట్టి సినిమాలు తీస్తూ ఉన్నాడు. కాగా పఠాన్ హిట్అవడంతో ఆయన అభిమాని ఒకరు షారుఖ్ మైనపు బొమ్మను తయారు చేశాడు. పశ్చిమబెంగాల్ లోని అసన్పోల్కు చెందిన కళాకారుడు సుశాంత్రాయ్రెండు నెలల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు.
పఠాన్ హిట్ కావడంతో..
పఠాన్ హిట్కావడంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అందరికి భిన్నంగా ఏదైనా చేయాలని అనుకుని షారుఖ్ మైనపు బొమ్మను తయారు చేశాడు. ప్రస్తుతం ఈ విగ్రహం అసన్ సోల్‌లోని ప్రైవేటు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. షారుఖ్‌ని కలిసినప్పుడు ఈ విగ్రహాన్ని కానుకగా ఇవ్వాలనుందని సుశాంత్ రాయ్ తెలిపారు.
ఇటీవల విడుదలైన పఠాన్ ప్రపంచవ్యాప్తంగా షారుఖ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో షారుఖ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటించింది.