Shah Rukh Khan: 'నా భర్త కంటే మీరే ఎక్కువ'.. మహిళా ఫ్యాన్ ఓపెన్ ఆఫర్.. క్రేజీ రిప్లై ఇచ్చిన షారుఖ్ ఖాన్!

Shah Rukh Khan: 'నా భర్త కంటే మీరే ఎక్కువ'.. మహిళా ఫ్యాన్ ఓపెన్ ఆఫర్.. క్రేజీ రిప్లై ఇచ్చిన షారుఖ్ ఖాన్!

సిల్వర్ స్క్రీన్ పైనే కాదు.. రియల్ లైఫ్ లోనూ తనదైన హుందాతనంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. లేటెస్ట్ కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఒక రియల్ ఎస్టేట్ గ్రూప్ ఈవెంట్‌లో కింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక మహిళా అభిమాని చేసిన హంగామాకు ఆయన ఇచ్చిన క్రేజీ రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి కదా..

ఈ ఈవెంట్‌లో షారుఖ్ తన సూపర్ హిట్ పాటలకు స్టేజ్ మీద స్టెప్పులేసి అలరించారు. అభిమానులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ క్రమంలో ఒక మహిళా అభిమాని.. అందరి ముందూ స్టేజ్ పైనున్న షారుఖ్‌ను చూస్తూ ఎమోషనల్ అయిపోయింది. 'నా భర్త కంటే నేనే మిమ్మల్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కింగ్ ఖాన్' అంటూ ఓపెన్‌గా తన మనసులోని మాట చెప్పేసింది. ఈ ఊహించని డైలాగ్‌కు షారుఖ్.. తనదైన సిగ్నేచర్ స్మైల్‌తో, కన్ను గీటుతూ.. 'అయ్యో.. ఇలాంటి పర్సనల్ విషయాలన్నీ అందరి ముందు కాకుండా.. ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి కదా అని పేర్కొన్నారు. దాంతో ఆడిటోరియం మొత్తం నవ్వులు, ఈలలతో అట్టుడుకిపోయింది.

 

భర్తకు స్పెషల్ మెసేజ్!

కేవలం జోక్‌తోనే వదిలేయకుండా, సదరు మహిళా అభిమాని భర్త హర్ట్ అవ్వకుండా ఉండేందుకు షారుఖ్ వెంటనే ఎంతో హుందాగా స్పందించారు. మీరు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు అర్థమైంది. మీ భావాలను నేను గౌరవిస్తాను. మీ భర్త కూడా దీనిని సరదాగానే తీసుకుంటారని భావిస్తున్నాను. ఐ లవ్ యూ ఆల్.. మీ భర్తను, మీ ఫ్యామిలీని కూడా నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. థాంక్యూ సో మచ్ అంటూ సిట్యుయేషన్‌ను సూపర్బ్‌గా హ్యాండిల్ చేశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SM3💛🫠 (@munnaaframes)

 

2026 క్రిస్మస్ వేటగా 'కింగ్'

షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కింగ్' (King) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో, సుజోయ్ ఘోష్ స్క్రీన్‌ప్లేతో వస్తున్న ఈ భారీ యాక్షన్ మూవీ ద్వారా షారుఖ్ కూతురు సుహానా ఖాన్ ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రంలో దీపికా పదుకోనే, అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 24, 2026న క్రిస్మస్ కానుకగా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు షారుఖ్ స్వయంగా ప్రకటించారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

►ALSO READ | The India Story Teaser: ఆహార కల్తీపై గళమెత్తిన ‘ది ఇండియా స్టోరీ’.. దేశాన్ని కుదిపేస్తున్న సమస్యపై కాజల్ మూవీ