విమర్శలకి ఫుల్ స్టాప్ పెట్టిన నయనతార..

 విమర్శలకి ఫుల్ స్టాప్ పెట్టిన నయనతార..

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార(nayanathara) జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. షారుఖ్ ఖాన్(shah rukh khan) హీరోగా తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని వెయ్యి కోట్ల కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతోంది.  ఈ చిత్రంలో నయనతార లీడ్ రోల్ చేసిన ఆమె స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంటుంది.

ఈ విషయంలో నయనతార దర్శకుడు అట్లీపై కోపంగా ఉందని, తనకి చెప్పిన విధంగా పాత్ర లేదని అసహనం వ్యక్తం చేసినట్లు కోలీవుడ్ సర్కిల్ లో  ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆమె కన్నా దీపికా పదుకునే పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో నయన్ హర్ట్ అయ్యిందనే టాక్ నడుస్తోంది. 

లేటెస్ట్ గా అట్లీకి బర్త్ డే విషెస్ చెప్పడంతో ఈ విమర్శలకి నయనతార ఫుల్ స్టాప్ పెట్టింది. ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్ ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ చూసిన తర్వాత నిజంగానే నయనతార తన పాత్ర విషయంలో అప్సెట్ అయ్యిందని అర్థమవుతోంది. జవాన్ చిత్రంలో సింగిల్ మదర్ నర్మద చాలా బలమైన పాత్ర.  ఆ పాత్ర అద్భుతంగా ఉంటుందని నేను భావించాను.

అయితే దురదృష్టవశాత్తు నర్మద పాత్రకి స్క్రీన్ టైం తక్కువగా ఉంది అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఓ అభిమాని పెట్టిన పోస్ట్ ని షారుఖ్ ఖాన్ రెప్లై ఇస్తూ ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు. దీనిని బట్టి నయనతార పాత్ర నిడివి తగ్గడంపై షారుఖ్ ఖాన్ కూడా కొంత నిరాశ చెందినట్లు అర్ధమవుతోంది.

ప్రస్తుతం నయనతార తమిళ్ ఫేమస్ యూట్యూబర్ డ్యూడ్ విక్కీ(Youtuber Dude Vicky) డైరెక్షన్లో మన్నగట్టి అనే మూవీ చేస్తోంది. అలాగే జయం రవి హీరోగా ఐ అహ్మద్ డైరెక్ట్ చేస్తోన్న ఇరైవన్( Iraivan) మూవీ త్వరలో (సెప్టెంబర్‌ 28న) రిలీజ్ కాబోతుంది