
కరాచీ: టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విరాట్ కోహ్లీపై.. పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్‌లో మరికొంత కాలం బ్యాటర్‌గా రాణించాలంటే.. కోహ్లీ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలగాలని సూచించాడు. షార్ట్ ఫార్మాట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించడం కరెక్ట్ నిర్ణయమన్నాడు. ‘ఇండియన్ క్రికెట్‌లో కోహ్లీ తిరుగులేని శక్తిగా ఎదిగాడు. అతని సేవలు మరికొన్ని రోజులు కొనసాగాలంటే మిగతా రెండు ఫార్మాట్ల కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పాలి. అప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటర్‌గా రాణిస్తాడు. అదే టైమ్‌లో ఆటను బాగా ఎంజాయ్ చేస్తాడు కూడా. ఇది టీమిండియాకు మరింత మేలు చేస్తుంది. నేను ఏడాది పాటు రోహిత్‌తో కలిసి ఆడాను. అద్భుతమైన ప్లేయర్. మానసికంగా చాలా ధృడమైన వ్యక్తి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటాడు. అవసరమైనప్పుడు దూకుడును కూడా చూపెడతాడు’అని ఆఫ్రిది పేర్కొన్నాడు.