
షారుఖ్ ఖాన్, నయనతార జంటగా తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన చిత్రం ‘జవాన్’. సెప్టెంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. గురువారం ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘అనగనగ ఒక రాజు.. ఒకదాని తర్వాత ఒకటి యుద్ధం ఓడిపోతూనే ఉన్నాడు. దాహంతో, ఆకలితో అడవిలో తిరుగుతున్నాడు. అతను చాలా కోపంగా ఉన్నాడు’ అనే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో గూజ్ బంప్స్ తెప్పించేలా ఉంది.
ముంబైలోని మెట్రో ట్రైన్‌ను హైజాక్ చేసిన షారుఖ్.. తనకు ఏం కావాలని అడగ్గా, అలియాభట్ కావాలని షారుఖ్ చెప్పడం ఫన్నీగా ఉంది. ఇందులో ఆయన పోలీసుగా, జవాన్‌గా డిఫరెంట్ లుక్స్‌తో కనిపించి మెప్పించారు. విలన్‌గా కనిపించిన విజయ్ సేతుపతి కూడా డిఫరెంట్ గెటప్‌లో ఆకట్టుకున్నాడు. ‘దేశం కోసం ‘ జవాన్’గా ఒక్కసారి కాదు, వెయ్యి సార్లు అయినా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం’ అని షారుఖ్ చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. నయనతార యాక్షన్ లుక్‌లో మెప్పించగా, దీపికా పదుకొనె గెస్ట్ రోల్ పోషించింది. రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.