Dunki Movie X Review: డంకీ మూవీ ఎలా ఉంది? ఆడియన్స్ ఏమంటున్నారు?

Dunki Movie X Review: డంకీ మూవీ ఎలా ఉంది? ఆడియన్స్ ఏమంటున్నారు?

బాలీవుడ్‌ కింగ్ ఖాన్ షారుక్‌ఖాన్‌(Shahrukh khan), స్టార్ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరాణి(Rajkumar Hirani) కాంబోలో వచ్చిన ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ డంకీ(Dunki). రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ అండ్ జియో స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, తాప్సీ పన్ను, బొమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చార్, అనిల్ గ్రోవర్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. పఠాన్‌, జవాన్‌ లాంటి బ్లాక్‌ బస్టర్స్ తర్వాత షారుఖ్ నుండి వస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకుల్లో డంకీ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలు మరింత పెంచేయగా.. డంకీ మూవీ నేడు(డిసెంబర్‌ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు చాలా చోట్ల ఫస్ట్‌ షోస్ పడ్డాయి. సినిమా చూసిన ఆడియన్స్, ఫ్యాన్స్ సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మరి ఆడియన్స్ సినిమా గురించి ఏమనుకుంటున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

డంకీ సినిమాకు సోషల్ మీడియాలో ఆడియన్స్ నుండి మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. షారుక్‌ ఖాన్‌ ఖాతాలో మరో హిట్‌ పడిందని కొంతమంది అంటుంటే.. మరికొందరేమో యావరేజ్‌ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో 2 గంటల 40 నిమిషాల పాటు సినిమాను భరించడం చాలా కష్టమని చెప్తున్నారు. కథాకథనాలు బాగానే ఉన్నా వాటిని ప్రెజెంట్ చేసిన విధానం చాలా స్లోగా ఉందని అంటున్నారు ఆడియన్స్. అందుకే సినిమా బీర్ ఫీల్ వస్తుందంటున్నారు. మరోపక్క.. డంకీ మెగా బ్లాక్ బస్టర్ అని, షారుఖ్ నటన టాప్ నాచ్ అని, భావోద్వేగాలతో హృదయాలను కట్టిపడేశారని, మాస్టర్ పీస్ మూవీ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మొత్తంగా చూసుకుంటే.. డంకీ మూవీలో కామెడీ బాగా వర్కౌట్ అయ్యిందని, అదే సినిమాకు బలంగా మారిందని, దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరాణి మరోసారి తనదైన స్క్రీన్‌ప్లేతో మాయ చేశాడని  తెలుస్తోంది.