Cricket World Cup 2023: బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి షకీబుల్ హసన్‌ ఔట్

Cricket World Cup 2023: బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి షకీబుల్ హసన్‌ ఔట్

వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్, కెప్టెన్ షకీబుల్ హసన్ వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యాడు. సోమవారం(నవంబర్ 6) శ్రీలంకతో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షకీబ్ వేలుకు గాయమైంది. ఈ మ్యాచ్ లో ఇబ్బందిగానే బ్యాటింగ్ చేసిన షకీబ్.. 82 పరుగులు చేసి మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్‌ అనంతరం ఎక్స్‌రే తీయించగా వేలు విరిగినట్లు తేలింది. దీంతో వరల్డ్ కప్ లో చివరి మ్యాచ్ కు ఈ స్టార్ ఆల్ రౌండర్ దూరమయ్యాడు. 

బంగ్లాదేశ్ తమ చివరి మ్యాచ్ నవంబర్ 11 న ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. ఇప్పటికీ ఈ టోర్నీ నుంచి షకీబ్ సేన నిష్క్రమించినా.. 2025 లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ మ్యాచ్ కీలకం కానుంది. దీంతో కీలకమైన ఈ  మ్యాచ్ కు షకీబ్ దూరమవ్వడం బంగ్లాదేశ్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. షకీబ్  స్థానంలో అనాముల్‌ హక్‌ బిజయ్‌కు జట్టులో చోటు కల్పించారు. 

ఈ వరల్డ్ కప్ లో బంగ్లా ప్రదర్శన ఒకసారి పరిశీలిస్తే.. తొలి మ్యాచ్ లో  ఆఫ్ఘనిస్తాన్ పై గెలిచి శుభారంభం చేసింది. అయితే ఆ తర్వాత వరుసగా 6 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. అయితే కీలకమైన శ్రీలంకపై మ్యాచ్ గెలిచి వరల్డ్ కప్ నుండి నిష్క్రమించినా.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆశలు సజీవంగానే ఉంచుకుంది.