వైడ్ ఇవ్వలేదని అంపైర్ పైకి దూసుకెళ్లాడు

వైడ్ ఇవ్వలేదని అంపైర్ పైకి దూసుకెళ్లాడు

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో  షకీబల్ హసన్  ప్రవర్తన చర్చనీయాశంమైంది. వైడ్ ఇవ్వలేదని అంపైర్పై కోపాన్ని ప్రదర్శించాడు. పెద్దగా అరుస్తూ అతని మీదకు వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. 

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఫార్చూన్ బరిషల్ టీమ్..సిలెట్ స్ట్రైకర్తో తలపడింది. ఈ మ్యాచ్లో షకీబల్ హసన్   హసన్ 67 పరుగులు చేశాడు. అయితే బౌలర్ వేసిన ఓ షార్ట్ బాల్..షకీబుల్ హసన్ పై నుంచి వెళ్లింది. అది వైడ్ అని నమ్మిన షకీబల్ ..అంపైర్ వైడ్ ఇస్తాడని అనుకున్నాడు. కానీ అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో కోపంతో ఊగిపోయాడు. బ్యాట్ పట్టుకుని పెద్దగా అరుస్తూ అతనిపైకి దూసుకెళ్లాడు. 

షకీబుల్ అరిచినా.. అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.  తొలి బౌన్సర్‌గా పరిగణనలోకి తీసుకున్నట్లు సైగ చేయడంతో..షకీబల్  నాన్‌స్ట్రైకర్ వద్ద ఉండే అంపైర్ దగ్గరకు వెళ్లి చర్చించాడు. ఆ అంపైర్‌తో కూడా మాట్లాడినా...వైడ్ ఇవ్వకపోవడంతో..మళ్లీ బ్యాటింగ్‌కు  వెళ్లిపోయాడు.