సమంత సినిమా ఫ్లాప్.. భారీ నష్టాల్లో మేకర్స్

సమంత సినిమా ఫ్లాప్.. భారీ నష్టాల్లో మేకర్స్

గుణశేఖర్ రచన, దర్శకత్వం వహించిన సినిమా శాకుంతలం. ఈ సినిమాలో శకుంతల క్యారెక్టర్ లో సమంత నటించింది. దేవ్ మోహన్ దాస్ లీడ్ రోల్ పోషించాడు. ప్రేక్షకుల్లో ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్లు రాబట్టలేకపోయింది. దాంతో సినిమా నిర్మాతలు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు.

రూ.65 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన శాకుంతలం.. ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. డిస్టిబ్యూటర్లు, శాటిలైట్ రైట్స్ ఇలా అన్నింటినుంచి నష్టాలే ఎదురయ్యాయి. దీంతో నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ గుణశేఖర్ దాదాపు రూ.20 కోట్ల నష్టం ఏర్పడింది.