రూ.10 లక్షల లంచం.. ఏసీబీకి పట్టుబడిన శామీర్‌పేట్ తహసీల్దార్

రూ.10 లక్షల లంచం.. ఏసీబీకి పట్టుబడిన శామీర్‌పేట్ తహసీల్దార్

మేడ్చల్ జిల్లా: శామీర్‌పేట్ తహసీల్దార్ సత్యనారాయణ ఏసీబీ వలకు చిక్కాడు. ఓ భూ వివాదంలో 10 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను పట్టుకున్నారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆయన డ్రైవర్ భద్రి.. రామశేషగిరి రావు అనే వ్యక్తి నుంచి 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు.

 ఏసీబీ అధికారులుడ్రైవర్ భద్రితో పాటు తహసీల్దార్ సత్యనారాయణను అదుపులోకి తీసుకొని విచారించగా లంచం తీసుకున్నట్టు అంగీకరించారు. తన పేరు మీద భూమి పట్టా చేయాలంటే తహసీల్దార్ రూ. 10లక్షలు డిమాండ్ చేయడంతో రామశేషగిరి రావు అనే వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు.

Also Read:పాలి క్లినిక్పై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ టీం దాడులు