పాలి క్లినిక్పై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ టీం దాడులు

పాలి క్లినిక్పై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ టీం దాడులు

తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ టీం తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ గోల్కొండలోని ఎస్ ఎం పాలి క్లినిక్ పై దాడులు నిర్వహించింది. పేషంట్లను తప్పుదోవ పట్టించేల ప్రకటనలు చేస్తున్నారనే ఆరోపణలతో రైడ్స్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో భాగంగా డీసీఎ, లక్ష రూపాయలు విలువ చేసే సహేత్ కేర్ పౌవడర్ ను స్వాధీనం చేశామని అధికారులు పేర్కొన్నారు.

ఎస్ ఎం పాలి క్లినిక్  నిర్వాహకుడు అనుమతులు లేకుండా ప్రకటన చేశారని తెలిపారు. డైయాబెటీస్, బ్లడ్ ప్రెజర్ ట్రీట్మెంట్ అంటూ ప్రకటనలు బహిర్గతం చేశారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా క్లినిక్ ని సీజ్ చేశామని వెల్లడించారు. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ కింద క్లినిక్ ని సీజ్ చేశామని తెలిపారు.