
ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ చేపట్టిన ఎయిర్పోర్ట్ క్వాలిటీ సర్వేలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బెస్ట్ ఎయిర్ పోర్టు అవార్డు లభించింది. 2024కు గాను ఏడాదికి 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికుల రాకతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిలిచింది.
ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్‌కు చెందిన ఎయిర్పోర్ట్సర్వీస్ క్వాలిటీ ప్రోగ్రామ్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్ట్ ప్యాసెంజర్స్ సాటిస్ఫాక్టరీ లెవల్స్‌ను కొలవడానికి బెంచ్ మార్క్‌గా పరిగణిస్తారు. ఇది విమానాశ్రయాల పరిమాణం, ప్రాంతం, డెడికేటెడ్ స్టాఫ్, సులభతర ప్రయాణం, వినోదాత్మక, ఆహ్లాదకర వాతావరణం, పరిశుభ్రత వంటి అంశాల ఆధారంగా ఎయిర్ పోర్ట్స్‌కు ర్యాంకింగ్స్ ఇస్తుంది.