శంషాబాద్ లో బాలికపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్ట్

శంషాబాద్ లో బాలికపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్ట్

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్‌‌పోర్టు పోలీస్ స్టేష‌‌న్ ప‌‌రిధిలో పదేండ్ల బాలికపై ఓ యువకుడు లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇన్​స్పెక్టర్​ బాలరాజు కథనం ప్రకారం.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన సంజయ్ పరాహు(25) అలియాస్ ఇర్ఫాన్ హుస్సేన్ కర్నాటకలో కొన్ని రోజులు లేబర్ గా పని చేశాడు. సోమవారం శంషాబాద్ వచ్చాడు.  బెంగళూరు జాతీయ రహదారి ఫ్లైఓవర్​ కింద ఏపీలోని తిరుపతికి చెందిన ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వారు దొరికిన పని చేసుకుంటూ లేకపోతే  భిక్షాటన చేస్తూ బతుకుతున్నారు.  అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న సంజయ్..​బాలిక తల్లిదండ్రులతో మాటలు కలిపాడు. వారు నిద్రలోకి జారుకున్నాక బాలికను పక్కనే ఉన్న ఓ హోటల్ లోని రూమ్​కు  తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు.

 అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. బాధితురాలు తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి  జరిగింది చెప్పడంతో వారు ఎయిర్​పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్​స్పెక్టర్​ బాలరాజు తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టి, 2, 3 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్​చేశారు.  అనంతరం అతన్ని సంఘటన స్థలానికి తీసుకెళ్లి సీన్​ రీకన్​స్ట్రక్షన్ చేశారు. బాలికను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. సంజయ్​పై పోక్సో కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించిన ఇన్​స్పెక్టర్​పేర్కొన్నారు.