జెంటిల్‌‌‌‌మేన్‌‌‌‌ టు గేమ్ చేంజర్

జెంటిల్‌‌‌‌మేన్‌‌‌‌ టు గేమ్ చేంజర్

సామాజిక సందేశం, హై టెక్నికల్ వేల్యూస్‌‌‌‌తో కూడిన భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్‌‌‌‌ అడ్రస్‌‌‌‌ దర్శకుడు శంకర్. తన మేకింగ్‌‌‌‌ స్టైల్‌‌‌‌తో ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్‌‌‌‌కు స్ఫూర్తిగా నిలిచిన ఆయన కెరీర్‌‌‌‌‌‌‌‌ మొదలై ముప్ఫై ఏళ్లు పూర్తయింది.  

1993లో వచ్చిన ‘జెంటిల్‌‌‌‌మేన్‌‌‌‌’ సినిమాతో దర్శకుడిగా కెరీర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించారు శంకర్. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌ కొట్టి, భారతీయుడు, జీన్స్, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, రోబో లాంటి చిత్రాలను తెరకెక్కించారు.  

డైరెక్టర్‌‌‌‌గా 30 ఏండ్ల సక్సెస్‌‌‌‌ఫుల్ జర్నీని పూర్తి చేసిన సందర్భంగా డైరెక్షన్‌‌‌‌ టీమ్ ఆయనతో స్పెషల్ కేక్‌‌‌‌ కట్‌‌‌‌ చేయించింది. ఇక ప్రస్తుతం ఆయన ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి కమల్ హాసన్‌‌‌‌తో తీస్తున్న ‘ఇండియన్ 2’ కాగా, మరొకటి రామ్ చరణ్‌‌‌‌తో తీస్తున్న ‘గేమ్ చేంజర్‌‌‌‌‌‌‌‌’.