
- లోక్‌సభలో ఆయన మాటలను వక్రీకరించారని వ్యాఖ్య
న్యూఢిల్లీ: హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని జ్యోతిర్మఠం 46వ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఆయన మద్దుతు తెలిపారు. ‘‘రాహుల్ గాంధీ ప్రసంగం మొత్తం మేము శ్రద్ధగా విన్నాం. హిందుత్వం హింసను తిరస్కరిస్తుంది అని ఆయన చెప్పారు.
కానీ, రాహుల్ ప్రసంగంలో కొంత భాగాన్ని మాత్రమే తీసుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. వాస్తవాలను వక్రీకరించి, జనాలను తప్పుదారి పట్టించారు. ఇది అనైతిక చర్య. అబద్ధాలను ప్రచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి” అని శంకరాచార్య డిమాండ్ చేశారు.