26 ఏళ్లుగా ప్రజలకు దాహం తీరుస్తున్న వాటర్ మ్యాన్

26 ఏళ్లుగా ప్రజలకు దాహం తీరుస్తున్న వాటర్ మ్యాన్

ఎండాకాలంలో గుక్కెడు నీటి కోసం ప్రజలు పడరాని కష్టాలు పడుతున్నారు. సూర్యతాపం నుంచి తప్పించుకునేందుకు చల్లటి వాటర్, జ్యూస్ లను ఎక్కువగా సేవిస్తుంటారు. కొన్ని సేవా సంస్థలు, రాజకీయ నేతలు ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తుంటారు. కానీ శంకర్ లాల్ సోనీ అనే వ్యక్తి మాత్రం ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో 26 ఏండ్లుగా ఉచితంగా వాటర్ ను పంపిణీ చేస్తున్నాడు. 

శంకర్ లాల్ సోనీ... మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ లో వాటర్ మ్యాన్ గా పిలుస్తుంటారు. ఎందుకంటే ప్రజల దాహార్తిని తీర్చడంలో తనవంతు సాయం చేస్తున్నాడు. సైకిల్ పై వాటర్ బాటిళ్లు, వాటర్ స్టోరేజీ ప్యాకెట్లు తీసుకెళ్లి అందరి దాహం తీరుస్తున్నాడు. అందుకే జబల్ పూర్ వాసులు ఆయనను ముద్దుగా వాటర్ మ్యాన్ అని పిలుస్తుంటారు. దాహం తీర్చిన శంకర్ లాల్ ఎవ్వరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోడు. నిస్వార్థంతో ప్రజలకు సేవ చేస్తుంటాడు. 


సమ్మర్ లోప్రజలకు చల్లటి నీటిని అందిస్తున్నాడు శంకర్ లాల్. అలా చేయడం వల్ల లాభం ఏంటని అడిగితే ప్రజలకు దాహం తీర్చడం వల్ల కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిదంటాడు. అందుకే సైకిల్ కు రెండు వైపులా 18 వాటర్ బాటిళ్లు, 18 వాటర్ బ్యాగులు తగిలించుకుని ప్రజల దాహాన్ని తీరుస్తున్నాడు. దాదాపు 26 ఏళ్లుగా ఇదేవిధంగా చేస్తున్నాడు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నశంకర్ లాల్ పై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

 

మరిన్ని వార్తల కోసం

600 బ్రాంచీల మూత?

రాష్ట్రంలో రాహుల్ టూర్ షెడ్యూల్